24 April, 2026 | 1:22 AM

టీఏ, డీఏలపై ఉత్తర్వులు జారీ

12-05-2024 12:28 AM

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి) : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అందించే టీఏ, డీఏలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఆధారంగా రేట్లను నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు రోజుకు రూ.600, పోలింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్లకు రోజుకు రూ.400, క్లాస్ సిబ్బందికి రోజుకు రూ.300ను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలిస్ సిబ్బందికి కూడా ఇదే విధంగా టీఏ, డీఏలను చెల్లించనున్నట్లు తెలిపింది. అలాగే, శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి కూడా ఇదే రకమైన పారితోషితం అందిచనున్నట్లు సర్కారు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది