ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న మోదీ
పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): బీజేపీ నాయకులు ఎన్నికల నియమావళిని పాటించడం లేదని, ముఖ్యంగా మోదీ, అమిత్‌షాలు ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లం ఘిస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీ కాంగ్రెస్ పార్టీని, నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నారు .
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. మోడీని అదుపు చేస్తారా? లేదా నిబంధనలు రద్దు చేస్తారా? అంటూ ఎన్నికల కమిషన్‌ను నిలదీశారు. మోదీ పిల్లలతో ప్రచారం చేయిస్తున్నా మీకు కనిపించడం లేదా? అని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో కాంగ్రెస్‌కు సంబంధం ఉందంటున్న మోదీ.. గతంలో నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్భంగా అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్ళి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎందుకు తెలియజేశారో చెప్పాలని అన్నారు.






