calender_icon.png 14 May, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్కాపురి కాలనీలో ఫ్రెండ్లీ బాల్ బ్యాడ్మింటన్ మ్యాచ్

12-05-2025 02:45:53 AM

మణికొండ, మే 11: అల్కాపుర్ కాలనీలోని జయశంకర్ పార్కు గ్రౌండ్ లో మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు గోల్ మెడలిస్ట్ రాంమోహన రావు, మాజీ అధ్యక్షుడు ఆనంద్ రావుల నిర్వహణలో ఫ్రెండ్లీ బాల్ బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మణికొండ ఆటగాళ్లు శ్రీనివాస్ రావు, రమేష్, రామిరెడ్డి, మాధవ్ రెడ్డి, శ్రీకృష్ణా, సీతారామరాజు, దేవేందర్ రెడ్డిలు పాల్గొనగా పరిగి తరపున శ్రీశైలం, హరిలాల్, కిష్టయ్య, శంకర్, జె. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా సాగిన 3 ఆటలలో మొదట మణికొండ టీమ్ తరువాత పరిగి టీమ్ గెలుపొందగా మూడవ మ్యాచ్ మణికొండ వారు కైవసం చేసుకొన్నారనీ తదనంతరం ఈ మధ్య కాలంలో కేరళలో పాన్ ఇండియా మాస్టర్స్ ఆద్వర్యంలో జరిగిన 4వ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామ్మోహనరావుకు సంస్థ సభ్యులందరూ  సన్మానం చేశామని సంస్థ ప్రధాన సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు తెలియజేశారు.