31-12-2025 12:00:00 AM
స్వామ్యమాత్య జనపద దుర్గకోశ దండ; మిత్రాణి ప్రకృతయః
(కౌటిలీయం 6 స్వామి (నాయకుడు), అమాత్యులు (నిర్వహణాధికారు లు), జనపదం (దేశం.. సంస్థ), దుర్గం (కార్యాలయం), కోశం (ఆర్థిక వనరులు), సైన్యం (ఉద్యోగులు), మిత్రులు (వినియోగదారులు).. ఈ ఏడూ ప్రకృతులు అంటా డు ఆచార్య చాణక్య. అమాత్యుడు మొదలైన అయిదు ప్రకృతులకు స్వామి అధిపతి. ప్రకృతులు అంటే రాజ్యానికి అవయవాలు. ఈ ఏడూ దేశం లేదా సంస్థ ప్రగతి లో భాగస్వామ్యం వహిస్తే ప్రజల జీవితాలు వికసిస్తాయి.
ఈ ప్రకృతుల లక్షణా లను, అర్హతలను వివరించాడు, చాణక్య. నాయకుడు.. దైవ సంపద (ప్రజల సహకారం), బుద్ధి సంపద, బల సంపద (కష్ట నష్టాలు తట్టుకోగలిగే సమర్ధత), ధార్మిక వర్తన, సత్యనిష్ఠ, త్రికరణశుద్ధిగా ప్రవర్తించేతత్వం, కృతజ్ఞతా భావన, ఉదార స్వభా వం కలవాడు, ఉత్సాహవంతుడు, ఆలోచనాపరుడు, త్వరగా నిర్ణయాలు తీసుకు నేవాడు, స్థిరమైన నిశ్చయం కలిగినవాడు, అనుచరులను తనమార్గంలో నడపగలిగినవాడు, స్వచ్ఛశీలురైన పరివారం కలిగిన వాడుగా ఉండాలి.
వినయశీలత, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలనే కోరిక (శుశ్రూష), విషయంలోని ఆంతర్యాన్ని గ్రహించడం, గ్రహించిన దానిని జ్ఞాపకం పెట్టుకోవడం, ఊహ చేయడం (తెలిసిన విషయంలోని యుక్తిని గ్రహించడం.. ఊహ), అపోహను విడిచిపెట్టడం (అవసరం లేని దానిని వదిలివేయడం), సత్యాన్వేషణ, సమర్ధత, నిబ ద్ధత, కార్యాచరణలో వేగం కలవాడై ఉండాలంటాడు, చాణక్య. నాయకునికి తనను నమ్మి తన వెంట నడిచే అనుయాయులను ఆదరిస్తూ.. తన అభ్యుదయంలో భాగస్వాములను చేసే హృదయం కావా లి. శత్రువుల గూర్చిన సమగ్రమైన అవగాహనతో బృందాన్ని నడిపించే సామర్థ్యం గల నాయకుడు విజయం సాధిస్తాడు.
ప్రతివ్యూహాల రచన..
అమాత్యుడు అనగా కార్యనిర్వాహకుడు. మాటల్లో చతురుడు, పిరికితనం లేనివాడు, దార్శనికుడు (స్మృతి, మతి), శారీరక బలం కలిగినవాడు, చెడు అలవా ట్లు లేనివాడు, సైన్యాన్ని అనగా ఉద్యోగులను సమర్ధవంతంగా నడపగలిగిన వాడు, స్థితప్రజ్ఞుడు, సామదాన భేదదండోపాయాలను సమయానుకూలంగా ప్రయో గించడంలో నేర్పరి, చాపల్యం, దురాశ, క్రోధం, లోభం లాంటి వాటికి అతీతుడు, చిరునవ్వుతో హుందాగా నడుచుకునేవాడుగా ఉండాలి. ఒత్తిడి పాలు గాకుండా ఏ క కాలంలో అనేక సమస్యలను పరిష్కరించగలిగిన ధీపటిమ గలిగిన వాడు కావాలి. చేస్తున్న పనిపై స్పష్టమైన అవగాహనతో, అనుభవంతో, పోటీదారుల ఎత్తుగడలను ముందుగా గుర్తించి పోటీదారులకు దీటైన ప్రతివ్యూహాలు రచించుకోగలిగిన నైపు ణ్యం ఉండాలి. అప్పగించిన వనరులను సమర్ధవంతంగా, ప్రభావవంతంగా వినియోగించుకుంటూ సంస్థను నడపగలిగిన దక్షుడై ఉండాలి.
పరస్పర సహకారం..
జనపదాలు (కార్యాలయాలు).. దృఢమైన రక్షణ స్థానాలు కలిగియుండడం, ఆ హారపానీయాల భద్రత, రక్షణ, జీవనోపాధులు కలిగినది. వ్యవసాయానికి అనువైన సారవంతమైన నేల కలిగినది. ఉద్యానవనాలు, గోవులు, పశువుల సంపద కలిగిన ది, నిజాయతీ పరులైన ప్రజలు కలిగినది, వర్షాలపై ఆధారపడకుండా జలాశయాలతో నిండినది. నాణ్యమైన, శ్రేష్ఠమైన వస్తు సముదాయం అందుబాటులో ఉన్న ది, నిరంతరం ఉపాధిని ఇవ్వగలిగినది. అయినా జనపదం ఉత్తమమైనదిగా చెబుతాడు. రవాణా సదుపాయం, విద్యుత్తు లాంటి మౌలిక వసతులు కలిగిన ప్రదేశం వ్యాపారానికి అనువైనదిగా చెబుతారు. అలాగే జనపదం ఉత్పత్తి సేవలను స్వదేశంలోనూ విదేశాల్లోనూ అందించగలిగిన వ్యాపార పటిమ గలిగిన వ్యాపారవేత్తలతో కూడినదిగా ఉండాలి.
పరస్పర సహకార భావనతో పటిష్ఠమైన వ్యాపార ఒప్పందాలతో యువతకు ఉపాధిని కల్పిస్తూ.. న్యా యమైన, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సాగే వ్యాపారం వల్ల ప్రజలకూ, ప్రభుత్వానికి పురోగతి ఉంటుంది. కార్యాలయాల రక్షణ పటిష్ఠతను, గోప్యతను, నిర్వహణా విధానాన్నీ గురించి శ్రద్ధ తీసుకోవడం.. దుర్గ రక్షణగా చెబుతారు. పరిశుభ్రమైన వాతావరణంలో పనిచేయడం ఉల్లాసాన్నిస్తుం ది. అలసటను తగ్గిస్తుంది. పరిసరాల పరిశుభ్రత ఉద్యోగులకూ వినియోగదారుల కూ సంస్థ పట్ల సదభిప్రాయాన్ని కలిగిస్తుంది. కార్యాలయం గృహవాతావరణా న్ని స్పురింపచేయాలి. పరిశుభ్రత క్రమశిక్షణకు దర్పణంగా చూడబడుతుంది.
కరువు కాటకాలు..
కోశసంపదను గూర్చి చెపుతూ.. బం గారం, వెండి లాంటి వాటితో ఆర్థికంగా పటిష్ఠమైనది, చాలాకాలం కరువు కాటకాలు సంభవించినా తట్టుకోగలిగిన భద్ర త కలిగినది.. కోశ సంపదగా చెబుతున్నా డు. ప్రతి వ్యాపారవేత్తకు ఆర్థికంగా కష్టకా లం వస్తుంది.. దానిని తట్టుకోగలిగిన వనరులను కలిగి ఉండాలి. వినియోగదారుల కు సంతృప్తికరమైన సేవలను అందించడం, వాటాదారులకు లాభాలను పంచ డం.. సంస ్థ ప్రయోజనం. అమ్మకం ధర ఉత్పత్తి ధరకన్నా ఎక్కువగా ఉంటే సంస్ఠ ఆర్థికంగా పటిష్ఠంగా ఉంటుంది.
అయితే ఈనాటి పోటీ వ్యాపార ప్రపంచంలో అ మ్మకం ధరను నిర్ణయించడం క్లిష్టతరమైన సమస్యగా మారింది. నిన్నటిదాకా వ్యా పార ప్రపంచంలో ఉత్పత్తి ధరకు ఎంత లాభాన్ని వేసుకోవాలో నిర్ణయించుకొని అమ్మకం ధరను నిర్ణయించుకోవడం జరిగేది. నేడు పోటీదారుల ధరను, వస్తు నాణ్యతను, ప్రామాణికతను దృష్టిలో పె ట్టుకొని అమ్మకం వెలను నిర్ణయించుకోవాలి. అమ్మకం వెల నుంచి ఉత్పత్తి ఖర్చును తీసివేయగా వచ్చినది లాభంగా సంతృప్తి చెందాలి. ఉద్యోగుల నైపుణ్యాలు కూడా ఆస్తులుగా పరిగణించాలి. సంస్థ లాభాలు నిలకడగా, సహజమైన సామాన్యమైన రీతిలో ఊర్ధ్వముఖంగా నడిస్తే సంస్థ ప్రగతిపథంలో నడుస్తుంది.
సమన్వయంతో అభివృద్ధి..
తరతరలుగా తమకు అనుకూలంగా ఉంటూ.. తమచేత పోషింపబడి సంతోషంగా ఉండే సైన్యం లేదా ఉద్యోగులు ఉండడం అవసరం. విజ్ఞానంతో పాటుగా నైపుణ్యాన్ని కలిగి, శ్రమను తట్టుకోగలిగిన సామర్ధ్యం కలిగిన పరాక్రమశీలురు, సుఖ దుః ఖాల్లో పాలుపంచుకోగల అనుచరులను కలిగిఉండడం దండ సంపద అంటాడు.యజమాని ఔన్నత్యాన్ని కోరుకుంటూ నిరంతర కార్యశీలురైన ఉద్యోగుల అండదండలు కలిగిన నాయకుడిని అపజయం పలకరించడానికి కూడా సాహ సించదు. అత్యుత్తమ మైత్రీ ధర్మాన్ని పాటించే హితులు, బంధుమిత్రులు నా యకుని వెంట ఉంటే విజయం అతన్ని వరిస్తుంది.; వినియోగదారులను మిత్రులుగా భావించాల్సిన అవసరముంది.
ప్రభుత్వంలో బాధ్యు లైన వారిని కూడా మిత్రులుగానే వ్యవహరించాలి. సాధారణంగా రాజకీయాలు ఎలా ఉన్నా నాయ కులు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ కార్యకలాపాలను చట్టసభల్లో చర్చ చేయవచ్చు. కానీ బహి రంగంగా విమర్శ చేయడం సమంజసం కాదు. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా విదేశాల్లో భారతదేశాన్ని తక్కువగా చేస్తూ ప్రసగించడం జరుగుతున్నది. ప్రభావశీలత లేని విపక్షనేత ప్రసంగాల్లో మన భారతదేశాన్ని
‘మరణించిన ఆర్థిక వ్యవస్థగా’ పేర్కొనడం బాధ్యతారాహిత్యంగా భావించాలి.
ఇలా ఏడు ప్రకృతులూ సమన్వయంగా నడిస్తే సంస్థ లేదా దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు, చాణక్య.
పాలకుర్తి రామమూర్తి