6 April, 2026 | 7:31 AM

ఓరుగల్లు ఓటర్ చైతన్యం

14-05-2024 02:24 AM

పార్లమెంటరీ సెగ్మెంట్‌లో 64.08 శాతం పోలింగ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట నిఘా

ఒకటి రెండు చోట్ల ఈవీఎంల మొరాయింపు

వరంగల్, మే 13 (విజయక్రాంతి): వరంగల్  పార్లమెంట్  నియోజవర్గ పరిధిలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగిం ది. వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో అక్కడక్కడా కొద్దిసేపు ఈవీఎంల మొరాయింపు తప్ప సమస్యలు తలెత్తలేదు. వాతావరణం కూడా చల్లబడటంతో ప్రశాంతంగా కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండడంతో వారు సునాయాసంగా ఓటు వేశా రు. ఓటర్ల కోసం అధికారులు పోలింగ్ కేం ద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు.

అధికారుల పర్యవేక్షణ...

లోక్‌సభ స్థానంలో మొత్తం 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. 1,309 కేంద్రాల్లో లైవ్‌వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 397 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. 497 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బంది పోలింగ్ సరళిని పరిశీలించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ హనుమకొండలో ఓటు వేశారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి మారేపెల్లి సుధీర్‌కుమార్ భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఓటు వేశారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ గీసుగొండ మండలం వంచనగిరిలో ఓటు వేశా రు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి హనుమకొండలో ఓటు వేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెన్నారావుపేట మండలం అమీనాబాద్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దుగ్గొండి మండలం కేశవాపూర్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొర్రూరు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గణపురం మండలం బుద్దారంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొరాయించిన ఈవీఎంలు.. 

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌ఆర్ తోట 114, కొత్తవా డ 18వ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం లు కొద్దిసేపు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యమైంది. వర్ధన్నపేట మండల కేంద్రంలోని 258వ పోలింగ్ బూత్‌లోనూ ఇదే పరిస్థితి.  ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకున్న ది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 1,900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సాయంత్రం 6 గంటలలోపు కేంద్రాల్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి వరకు 64.08 శాతం పోలింగ్ నమోదైంది.