calender_icon.png 15 September, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన సంస్కృతి, సాంప్రదాయాలు ఆదర్శం

15-09-2025 12:00:00 AM

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై  మాట్లాడారు.

మన సంస్కృతి చాలా గొప్పదని అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో  మన పద్ధతులను ఆచరిస్తున్నారన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఈ సమావేశంలో పెద్ద ఎత్తున స్వామీజీలు, పీఠాధిపతులు, గురూజీలు, భక్తులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక

సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్ (ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున ఆ పార్టీలను వీడి ఆదివారం బి ఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మండలంలోని నెమ్మికల్ లో  మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో టిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీలను వీడి బీఆర్‌ఎస్ లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.