calender_icon.png 15 September, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

15-09-2025 12:00:00 AM

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ, సెప్టెంబర్ 14 : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 267 మంది లబ్ధిదారులకు రూ.91,78,500ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మరణించిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఒక రూపాయి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు... అవినీతి రహిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని ప్ర వేశపెట్టి అమలు పరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చి న హామీలను నెరవేరుస్తుందన్నారు. .ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు