03-05-2025 12:48:35 AM
వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) రెండో రోజూ కొనసాగింది. ముం బయి వేదికగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో శుక్రవారం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఈ సమ్మిట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తె లంగాణ స్టాల్‌ను ప్రముఖ నాగార్జున ఆవిష్కరించారు. అనంతరం వివిధ భారతీయ చిత్ర పరిశ్రమ లకు చెందిన కార్తి, ఖుష్బూ, అనుపమ్‌ఖేర్‌తో కలిసి ‘పాన్‌ఇండియా సినిమా’పై నాగార్జున మాట్లాడారు.
“పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూలు చేశారు. 100లో 90 మంది తమ ఒత్తిడి పోగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు హీరోలను.. పుష్పరాజ్, రాకీ (కేజీఎఫ్), బాహుబలిలాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ అదే ఇష్టపడతా.
కేవలం హీరోల ఎలివేషనే కాదు బలమైన కథలతోనే ఆయా చిత్రాలు విజయాలు సాధించాయి. రాజమౌళి ‘బాహుబలి’ని తెలుగులోనే తెరకెక్కించినా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దాన్ని ఆదరించారు” అని పేర్కొన్నారు. ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ తదితరులు వేడుకలో పాల్గొన్నారు. శ్రీలీలతోపాటు ఎం4ఎం మూవీ హీరోయిన్ జోశర్మ ఈ వేడుకలో సందడి చేశారు.