02-11-2025 05:13:55 PM
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
ముకరంపురా (విజయక్రాంతి): అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం మా ప్యానెల్ దేనని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆదివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కర్ర రాజశేఖర్ పానెల్ బీఆర్ఎస్ బిజెపితో ఆపవిత్ర పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కొద్ది ఓట్ల తేడాతోనే తమ ప్యానల్ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. అనైతిక చర్యలతోనే కర్ర రాజశేఖర్ ప్యానల్ గెలుపొందిందని పేర్కొన్నారు. కర్ర రాజశేఖర్ వ్యవహారంపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
నూతన పాలకవర్గం ఇకపై ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పార్టీ బలోపేతంతో పాటు రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్యానెల్ నుంచి గెలిచిన డైరెక్టర్లు ఉయ్యాల ఆనందం, అనరాసు కుమారుకు శాలువాలు కప్పి వెలిచాల రాజేందర్రావు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నూతన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ఉయ్యాల ఆనందం, అనరాసు కుమార్, కాంగ్రెస్ నాయకులు చిందం శ్రీనివాస్, తాండ్ర శంకర్, ఎం ఏ కరీం, కాసరపు కిరణ్, గండి గణేష్, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.