calender_icon.png 2 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు బాగుండాలన్నదే మా సంకల్పం

02-11-2025 05:11:13 PM

రూ.30 లక్షలతో సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన శంకుస్థాపన చేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

డప్పులు కొడుతూ స్వాగతం పలికిన గుడిమల్కాపూర్ గ్రామస్తులు..

హన్వాడ: ప్రస్తుతంతో పాటు భవిష్యత్తు తరాలకు సముచిత స్థానం కల్పించాలని సంకల్పంతోనే ప్రతి అడుగు వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని గుడి మల్కాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు గ్రామంలోడికి అడుగుపెట్టిన వెంటనే ఎమ్మెల్యేకు డప్పులు కొడుతూ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రతి గ్రామంలోని ప్రతి వీధికి  రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ శుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందిని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి–సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పారదర్శకంగా వినియోగిస్తున్నామని తెలిపారు.  ప్రజలు గ్రామ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, బుద్దారం సుధాకర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, నవనీత, యాదయ్య, వెంకట్ రెడ్డి, బాల గౌడ్, ఆంజనేయులు, అంజయ్య, యాదిరెడ్డి, శివ, విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.