02-11-2025 05:40:00 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): టిఎస్ఆర్టీసి మెట్ పల్లి డిపోలో ఆదివారం విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ రెండవ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి ఆదేశానుసారం సిబ్బందితో డిపో మేనేజర్ దేవరాజు అధ్యక్షతన విజిలెస్ అవగాహన కార్యక్రమం నిర్వహించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
మేము నైతిక వ్యాపార పద్ధతులను ప్రోత్సహించి నిజాయితీ, నిబద్ధత కలిగి సంస్కృతిని పెంపొందిస్తామని, మేము ఎలాంటి లంచాలు స్వీకరించమని, మేము పారదర్శకత బాధ్యత, న్యాయ సమానత ఆధారంగా మంచి సంస్థ పాలనకు కట్టుబడి ఉంటామని, ఏదైనా అవినీతి సంఘటన తెలిసినప్పుడు దాని సంబంధించిన అధికారికి సంస్థకు నివేదిస్తామని సిబ్బందిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి ఐ. ప్రమీల, హెడ్ కానిస్టేబుల్ ముజీబ్, శంకర్ రెడ్డి, రమేష్, సాయి చరణ్,వేణు అన్ని విభాగాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.