06-01-2026 12:00:00 AM
ముషీరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (విజాయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిర్బంధించిందని, కల్లుగీత సొసైటీల ప్రతినిదులపై కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నదని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘా ల సమన్వయ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిం ది. ఒకవైపు ప్రభుత్వ సహకారం లేక, మరోవైపు తమ వృత్తికి రక్షణ లేక కల్లుగీత వృత్తిదా రుల జీవనం ఆగమ్యగోచరంగా మారిందని పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గీతకార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్రేషియా అందజేతకు జీవో తేవాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిం ది. అదే విధంగా వైన్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల జీవో తీసుకురావాలని, కోహెడలోని గౌడ ఆత్మగౌరవ భవనం పనులు ప్రారం భించాలని కోరింది.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్ లతో కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. రెండేళ్లలో 751 మంది గీత కార్మికులు వృత్తిరీత్యా చెట్ల మీదికెళ్లి పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కానీ, వీరికి ప్రభు త్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. తూతూమం త్రంగా రూ.5లక్షలిచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని, ఇచ్చిన మాట ప్రకారం రూ.10లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాజకీయంగా ఎదుర్కొలేక తమ వృత్తులపై ఆధారపడుతున్న వారిపై కేసులు, దాడులు చేయిస్తూ ఇంకా కులవృత్తులను ప్రభుత్వం బలహీనపరుస్తుందన్నారు. ఫుట్బాల్, అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలు వ్యయం చేసిన ప్రభుత్వం మరణించిన గీత కార్మికుల కుటుంబాలు రూ.10 కోట్లు ఇవ్వకపోవడంపై కల్లు గీత వృత్తిపై ప్రభుత్వానికి నిర్ల క్ష్యం బద్దంపడుతుందని ధ్వజమెత్తారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలన్నారు.
అన్ని కులవృత్తులను కాపాడా లని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిమీద నార్కొటిక్, పోలీసుల దాడులు, కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అనేక ఉత్పత్తులు తయారు చేస్తూ అంతర్జాతీయంగా వ్యాపారం చేసేందుకు అవకాశమున్న నీరా భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కల్లుఅమ్మకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఐలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తి పరిరక్షణ కు బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కుల వృత్తుల సమస్యలకు రాజ్యాధికారం పరిష్కారమని, ఆ దిశగా బిసిలంతా ఒక్కటై పోరాడాలన్నారు. సమావేశం లో గౌడ సంఘాల ప్రతినిధులు అంబాల నారాయణ గౌడ్, దుర్గయ్య గౌడ్, వీరస్వామి ప్రభాకర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, గడ్డమీది విజయ కుమార్ గౌడ్, జిల్లాల నేతలు పాల్గొన్నారు.