పారమిత విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
కరీంనగర్, ఏప్రిల్15(విజయక్రాంతి): సెంట్రల్ బోర్డు సీబీఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి సీబీఎస్సీ వార్షిక ఫలితాల్లో స్థానిక నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఫలితాల్లో ఆప్షనల్ సబ్జెక్టులు కాకుండా,మెయిన్ సబ్జెక్టులలో 500 మార్కులకు 492 మార్కులతో చెన్న శ్రీశాంత్ జిల్లా లో మొదటి స్థానం సాధించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.గోపికృష్ణ తెలిపారు.
ఈ ఫలితాల్లో మొత్తం 347 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణతో పారమిత విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని వీరిలో యం. శ్రీవర్షిణి 487, కె. అగస్త్య 486, యం. పంజ్వాని 485, గంప సహస్ర 485, యం. రాహుల్ 485 , సీహెచ్. వెంకట మోక్షిత్ 485, దియా బుల్డాక్ 483, యం. సాయి అక్షర 481, యండీ అబ్దుల్ అరహాన్ లతీఫ్ 481, పి. రిధి 480 సాధించగా , సబ్జెక్టుల వారీగా 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు గణితంలో 3, ఆంగ్లం లో 2, తెలుగు లో 17 , సామాన్య శాస్త్రంలో1, సాంఘీక శాస్త్రంలో 99% మార్కులు 4 గురు విద్యార్థులు సాధించారు.
అత్యధిక విద్యార్థులు అత్యుత్తమ శాతాలతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన,అనుకర్ రావు, వినోదరావు, రశ్మిత, రాకేష్, వీయూ ఎం. ప్రసాద్, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు పి. గోపికృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు,రాము, ఉపాధ్యాయలు పాల్గొన్నారు. పాఠశాలకు ఉత్తమ సహకారాన్నందిచిన తల్లిదండ్రులకు చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాద రావు కృతజ్ఞతలు తెలియజేశారు.






