calender_icon.png 4 September, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

340 పైగా విమానాలు ఆలస్యం

04-09-2025 01:30:07 AM

దేశరాజధాని ప్రాంతాన్ని వదలని వరదలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచాయి. బుధవారం కూడా నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి 340 పైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వర్షాల వల్ల ఈ విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 273 విమానాలు, ఢిల్లీకి రావాల్సిన 73 విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి. ఫ్లుటై రాడార్ 24 డాటా ఈ విషయాలను వెల్లడించింది. ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్న నిగమ్ బోద్ ఘాట్ (శ్మశాన వాటిక)ను తాత్కాలికంగా మూసి వేశారు. రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.