2 April, 2026 | 3:21 AM

ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్‌కు అనూహ్య స్పందన

02-04-2026 01:35 AM

‘ఐఐఎంసీ’ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఇంగ్లీష్ విభాగం బుధవారం ఇంగ్లీష్ టాలెం ట్ టెస్ట్‌ను అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులలో ఇంగ్లీష్ సాహిత్యం, వ్యాకరణ అంశా ల పై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ‘ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్’ను నిర్వహించారు.

ఇం దులో 8 దేశాల నుండి భారత దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన 23 నగరాల్లోని వివిధ కళాశాలలకు చెందిన 1,122 మంది విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపల్ కూర రఘు వీర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అ బ్దుల్ అయాన్ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, నిర్మల్) మొదటి బహుమతి గా రూ. 5,000, అర్షద్ (సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్) రెం డ వ బహుమతిగా రూ.3,000-, వినీత (వెల్ టెక్ మల్టీ టెక్ డాక్టర్ రంగరాజన్ డాక్టర్ శ కుంతల ఇంజనీరింగ్ కళాశాల, చెన్ను)  మూ డవ బహుమతిగా రూ.2,000,

ఆర్ ఐశ్వర్య (మన్నీర్ తిరుమలై నయ్ కర్ కళాశా ల, మదురై), అనిల్ మోనే (ఒమేగా స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్), సిహె. మధుసూదన్ (భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కళాశాల, హైదరాబాద్), వాసీమా తబస్సుమ్ (అంజద్ అలీ ఖాన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కళా శాల, హైదరాబాద్), డి.అంజి (డా. వీఎస్ కృష్ణ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం) 5 ప్రో త్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున అందజేశారు. ఇంగ్లీష్ వి భాగం అధ్యక్షురాలు కరుణశ్రీ పాల్గొన్నారు.