calender_icon.png 3 May, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో కులగణన కాంగ్రెస్ విజయమే

02-05-2025 08:48:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగలను చేపట్టి కులాల దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పోరాటం వల్లనే కేంద్రం దిగివచ్చి కులగరణకు ఆమోదం చెప్పడం జరిగిందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.