02-05-2025 08:44:00 PM
రూ.5 వేలు ఫైన్..
ఆరుగురి అస్వస్థత ఘటనపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందన
బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కలకలం రేపిన పానిపూరి తిని అస్వస్థకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. నాణ్యత లేని పానిపూ రీ విక్రయించి ఆరుగురి అస్వస్థత ఘటనపై మున్సిపల్ అధికారులు స్పందించారు. పట్టణంలోని కాల్టెక్స్ లో పానీపూరి తిని ఆరుగురు అస్వస్థకు గురైన సంఘటన తెలిసిందే. ఈ మేరకు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించి చర్యలకు ఆదేశించారు. ఆ మేరకు పానీ పూరి బండి యజమానికి రూ. 5000 జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా పానీపూరి బండిని సైతం సీజ్ చేశారు.
ఈ సంఘటనతో చిరు వ్యాపారులు పానీ పూరి తయారీలో సుచి శుభ్రతపై శ్రద్ధ పెట్టడానికి దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు. దీంతో పట్టణంలోని పానీ పూరీ చిరు వ్యాపారులు షాక్ గురయ్యారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ సునీల్,సిబ్బంది పాని పూరీ బండి ని సీజ్ చేశారు. పానీ పూరీ బండి యాజమాని సారాన్ కు రూ.5 వేల జరిమాన విధించారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు పట్టణంలో పానిపూరీ విక్రయాలను నిర్వహించరాదని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆదేశాలను అతిక్రమిoచిన వారిపై చర్యలు తీసుకుంటామని మరీ మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.