27-11-2025 08:44:50 AM
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మరణించారని వస్తున్న వార్తలను రావల్పండి అడియాలా జైలు(Adiala Jail) వర్గాలు ఖండించాయి. జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు రావల్పండిలోని జైలు వద్ద ఆందోళనలు విరమించారు. ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబానికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.
ఇవాళ, డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ను మరో జైలుకు తరలించారన్న వార్తలను కూడా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం ఇస్తున్నామని పాక్ రక్షణమంత్రి వెల్లడించారు. జైైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defence Minister Khawaja Asif) తెలిపారు. కస్టడీ ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక వసతులు కల్పించినట్లు రక్షణ మంత్రి తెలిపారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు.