calender_icon.png 27 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరోస్పేస్ హబ్..

27-11-2025 12:59:16 AM

ఏవియేషన్ కేంద్రంగా హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

శంషాబాద్ జీఎంఆర్ ఎకో పార్క్‌లో శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రయాణికులకు మరింత మేలు: కేంద్ర మంత్రిరామ్మోహన్‌నాయుడు 

గ్లోబల్ సమ్మిట్‌కు రండి: ప్రధానికి సీఎం ఆహ్వానం

రాజేంద్రనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): ఏరోస్పేస్ డిఫెన్స్‌కు కేంద్ర బిందువుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలు స్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోబార్ శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి పర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్‌నాయుడు, శాఫ్రాన్ చైర్మన్ రాక్ ఇన్నోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. హైదరాబాదులో శాఫ్రాన్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా రక్షణ రం గంలో కొత్త సదుపాయం ఎరోస్పేస్ తెలంగాణ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

రూ.1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా దాదాపు వెయ్యి మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ సబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువగా ప్రపంచస్థాయి ప్రధాన కంపెనీలు 150 కు పైగా ఎమ్‌ఎస్‌ఎంఈ లు ఉన్నాయని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో దేశంలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటి అని సీఎం చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఎరోస్పేస్ పార్కులు షెడ్యూలు అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టేలా చేశామని సీఎం వివరించారు. సేజ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ పరిశోధన అభివృద్ధి కోసం ఎంచుకున్నాయన్నారు. ఎరోస్పేస్ రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది కంటే పెట్టింపు అయ్యాయని తెలిపారు.

9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నదని ముఖ్యమంత్రి వివరించారు. మొదటిసారిగా ఫార్మ ఎగుమతులను అధిగమించామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా బెంగళూరు, హైదరాబాద్‌ను డిఫెన్స్ కారిడారుగా ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. 

విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్: ప్రధాని మోదీ

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఏవియేషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు 1500 కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విమానాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, సర్వీసింగ్ సెంటర్లు కూడా దేశీయంగానే ఉండటం ఎంతో ఉపయోగకరమన్నారు. శాఫ్రాన్ సంస్థకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధానంలో భాగంగా కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు ప్రధాని వెల్లడించారు.

సింగపూర్ వెళ్లాల్సిన పనిలేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ 

శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విమా నాల నిర్వహణ, తయారీ ఖర్చులు భారీ గా తగ్గుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ఇంజిన్ రిపేర్లు, సర్వీసింగ్ కోసం సింగపూర్, మలేషియా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం తప్పిందన్నారు. నిర్వహణ భారం తగ్గడం వల్ల ఆ లాభం టికెట్ల ధరల రూపంలో ప్రయాణికులకు కూడా బదిలీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.