27-11-2025 08:55:20 AM
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) హన్వాడ మండలం పిల్లిగుండు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి 167పై ఇథనాల్ ట్యాంకర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర మంటలు చెలరేగాయి. ఇథనాల్ ట్యాంకర్ మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్ర మంటలు చెలరేగాయి. కొన్ని సెకన్లలోనే ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ప్రమాదంలో చిక్కుకున్న మరో లారీ డ్రైవర్‌ను స్థానికులు రక్షించగలిగారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు అగ్నిమాపక యంత్రాలతో దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.