23-05-2025 12:52:45 AM
* మా ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వారు చక్రవ్యూహంతో పాక్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టారు.
నరేంద్రమోదీ, భారత ప్రధాని
న్యూఢిల్లీ, మే 22: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించి జాతి కి అంకితం ఇచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలందరూ గర్విస్తున్నారన్నారు.
‘భరతమాత సేవకుడు మోదీ ఉన్నాడనే విషయాన్ని పాకి స్థాన్ మర్చిపోయింది. నా మనస్సు ప్రశాంతంగా ఉంటుందేమో కానీ.. నా రక్తం మరుగుతోంది. నా సిరల్లో రక్తం కాకుండా సిందూరం ప్రవహిస్తోం ది. సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అంతా చూశారు. పాకిస్థాన్ ఇప్పటి వరకు భారత్‌తో ప్రత్యక్ష యుద్ధంలో గెలిచింది లేదు.
భారత్‌పై గెలిచేందుకు పాక్ టెర్రరిజాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఏప్రిల్ 22న చేసిన దాడికి ప్రతిగా 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. మన త్రివిధ దళాలు 9 చోట్ల ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశా యి. ఉగ్రమూకలను మట్టిలో కలిపేశాం.
మళ్లీ ఉగ్రదాడి చేస్తే పాక్ ఆర్మీ, ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు.. ఇదో కొత్త తరహా న్యాయం. పాక్ ఇలాగే టెర్రరిస్టులను ఎగుమతి చేస్తే.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాకిస్థాన్‌లోని రహిమ్‌యా ర్‌ఖాన్ వైమానిక స్థావరం ఇప్పుడు ఐసీయూలో ఉంది. భారత్ జోలికొస్తే ఊరుకునేది లేదని శత్రువులకు గట్టి హెచ్చరికలు పంపాం.
ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మన త్రివిధ దళాల చక్రవ్యూహం తో పాకిస్థాన్ మోకాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చిం ది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా అందదు. పాక్ భారతీయుల రక్తంతో ఆడుకోవాలని చూసినందుకు ఆ దేశానికి భారీ నష్టం వాటిల్లింది. భారతదేశ నిర్ణయాన్ని ప్రపంచంలోని ఏ దేశం కూడా మార్చలేదు.’ అని తెలిపారు.
పీవోకేపైనే చర్చ..
పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘అణు బెదిరింపులకు భారత్ భయపడదు. పాకిస్థాన్‌తో ఎటు వంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చలు జరిగితే అది పీవోకే గురించే ఉంటాయి. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు వెళ్ల దు. భారత ప్రజల జోలికొస్తే గట్టి గుణపాఠం తప్పదు. మన ప్రజల సిందూరాన్ని తుడవాలని చూసిన వారు మట్టిలో కలిసిపోయారు. భారత్‌లో సృష్టించిన రక్తపాతానికి సమాధానం చె ప్పాం.
భారత్ నిశబ్ధంగా ఉంటుంది అని అనుకునే వారు ప్రస్తుతం ఇండ్లల్లో నిశబ్ధంగా దాక్కు న్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. భారత్‌లోని రైలు నెట్వర్క్‌ను ఆధునికీకరిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. బహిరంగ సభకు ముందు ప్రధాని మోదీ కర్ణిమాత ఆలయాన్ని సందర్శించుకున్నారు. బికనీర్ సభలో కేంద్రమంత్రులు, రాజస్థాన్ ముఖ్య మంత్రి, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.
103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన ప్రధాని
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి మోదీ ఈ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రై లుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. చురు-సదల్‌పూర్ రైల్వే లైన్‌కు కూడా శంకుస్థాపన చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 19 రైల్వే స్టేషన్లు ఉండగా.. తెలంగాణలో మూడు స్టేషన్లు ఉన్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కరీంనగర్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నా రు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మొత్తం మహిళా ఉద్యోగులే విధులు నిర్వహిస్తారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.