calender_icon.png 16 May, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్‌ఎఫ్ జవాన్‌ను వేధించిన పాక్

16-05-2025 01:29:18 AM

నిద్రపోనివ్వకుండా రహస్యాలు చెప్పాలంటూ టార్చర్

న్యూఢిల్లీ, మే 15: 21 రోజులు తమ నిర్బంధంలో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణ మ్ కుమార్‌ను పాక్ రేంజర్లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. పాక్ అదుపు లో ఉన్నప్పుడు అతన్ని నిద్రపోనివ్వకుండా, భారత్‌కు సంబంధించిన రహస్యా లు చెప్పాలంటూ వేధించినట్టు తెలుస్తోంది. నిర్బంధం లో ఉన్నన్ని రోజులు పాక్ అధికారులు పూర్ణమ్‌ను మూడు ప్రాంతాల్లో తిప్పి ఓ జైల్లో బంధించారు. వారి వద్ద ఉన్న 21 రోజులూ కండ్లకు గంతలు కట్టే ఉంచినట్టు సమాచారం.

శారీరకంగా హింసించకున్నా, మాటలతో మా త్రం వేధించారని, కనీసం నిద్రపోనివ్వకుండా, బ్రష్ చేసుకోనివ్వకుం డా ఇబ్బంది పెట్టినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులో మొహరింపు, అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది.

కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని సమాచారం. అయితే బీఎస్‌ఎఫ్ నిబంధనల ప్రకారం పూర్ణ మ్ వద్ద ఫోన్ లేకపోవడంతో వారికి ఎలాంటి వివరాలు అందలేదు. ఈ ప్రశ్నలన్నీ అడిగిన అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నారట.