calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం జన్‌ధన్ యోజనతో ఆర్థిక విప్లవం

30-08-2025 01:47:35 AM

  1.   11 ఏళ్లలో 278 రెట్లు పెరిగిన అకౌంట్లు
  2.   56 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్ల నగదు జమ
  3. సామాన్యులకు అందుబాటులో బ్యాంకు సేవలు
  4. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కేవలం ఆర్థిక విప్లవం మాత్రమే కాదు.. సామాజిక విప్లవం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు బ్యాంకు ఖాతా తెరవడమే ఒక కలగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 67 శాతం ఖాతాలు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి ప్రధాని మోదీ తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ పథకం ప్రారంభించే నాటికి దేశంలోని అనేకమంది పేదల కు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదన్నా రు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం 2014 ఆగస్టు 28 న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ను అమల్లోకి తె చ్చిందన్నారు. నా టి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తం గా 56 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్ల నగదు జమ అయిందని తెలిపారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 3.35 కోట్ల బేసిక్ సేవింగ్స్ అకౌంట్లు మాత్రమే ఉండగా.. వాటిలో మొత్తం డబ్బు రూ.960 కోట్లు ఉందన్నారు.

సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు ఈ అకౌంట్లను ‘జన్ ధన్’ ఖాతాలుగా మార్చిందన్నారు. దీంతో ‘జన్ ధన్’ బ్యాంకు అకౌంట్ల సంఖ్య 56 కోట్లకు పెరగగా.. అందులో జమచేసుకున్న మొత్తం రూ.2.68 లక్షల కోట్లు ఉందన్నారు. 56 శాతం కన్నా ఎక్కువ ఖాతాలు మహిళల పేరుతోనే ఉన్నాయన్నారు. తెలంగాణలో 1.3 కోట్ల జన్‌ధన్ అకౌంట్లలో రూ.5,055.35 కోట్లు జమ అయ్యాయన్నారు.