16-05-2025 01:31:40 AM
ఖతార్ వేదికగా ఇండియాపై అక్కసు
న్యూఢిల్లీ, మే 15: ఖతార్ వేదికగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత్‌లో యాపిల్‌ను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్‌కు సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదికను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అరబ్ దేశాల పర్యటన లో భాగంగా ట్రంప్ బుధవారం ఖతార్‌లో పర్యటించారు.
కాగా అక్కడి పాలకులు ట్రంప్ కోసం దోహాలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు సీఈవోలు, వ్యాపారవేత్తలు హాజరవగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుక్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ట్రంప్.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత్‌లో సంస్థను విస్తరించొద్దని సూచించారు. ‘నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఎదురైంది.
అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని అతడికి చెప్పా. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెం చేందుకు యాపిల్ అంగీకరించింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశా ల్లో భారత్ ఒకటి.
అక్కడ వ్యాపారం చేయ డం చాలా కష్టమని కుక్‌కు వివరించా. భార త్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దేశం తనను తాను చూసుకోగలదని చె ప్పా. నా వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు యూఎస్‌లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.