calender_icon.png 30 August, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

30-08-2025 09:40:32 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు(Telangana Assembly Session) శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. నాలుగైదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్యేలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల మండలిలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడనున్నాయి.

అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings), పనిదినాలు, అజెండాను బీఏసీ ఖరారు చేయనుంది. అసెంబ్లీలో  కాళేశ్వరంపై నివేదికను(Kaleshwaram Report ) ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జస్టిస్ ఘోష్ నివేదికపై వాడివేడీ చర్చకు అవకాశముంది. నివేదికపై సమగ్ర చర్చ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సర్కార్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తొలిరోజు శాసనసభ వాయిదా తర్వాత కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం రిజర్వేషన్లకు జీవో ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే సభా సమరానికి సర్వం సిద్ధం చేశారు.