calender_icon.png 16 May, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందెళ్లి క్షమాపణ చెప్పండి

16-05-2025 01:26:21 AM

  1. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అలా మాట్లాడొద్దు

కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రికి సుప్రీం చీవాట్లు

న్యూఢిల్లీ, మే 15: ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన భారత సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమో దైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.

హైకోర్టు ఆదేశాలపై విజయ్‌షా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను శుక్ర వారం విచా రించేందుకు కోర్టు అనుమతి లభించింది. మంత్రి విజయ్ షా తీరును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తప్పుబట్టారు. ‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికా దు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి.

ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన కర్నల్ ఖురేషీని మంత్రి విజయ్ షా ‘ఉగ్రవాదుల సోదరి’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దుమారం రేగడంతో సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, మం త్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, చీవాట్లు పెట్టింది.