calender_icon.png 30 August, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం మహా జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి

30-08-2025 08:49:01 AM

మేడారం మహా జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి.

అన్ని పనులు నాణ్యతతో శాశ్వతంగా నిలిచే విధంగా ఉండాలి.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి: మంత్రి ధనసరి  అనసూయ సీతక్క.

తాడ్వాయి,(విజయక్రాంతి): జనవరి 28నుండి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం సాయంత్రం రానున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని మేడారంలోని ఐటిడిఏ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రాలతో కలిసి పూజారులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.   

ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ రీ డెవలప్ మెంట్ ప్లాన్ ను  ఆర్కియాలజిస్ట్, వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న పనులు ఏఏ దశలో ఉన్నయో వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం శాశ్వత అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  ఫలితంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. జాతర లోపు మొదటి విడత పనులను పూర్తి చేయాలని అన్నారు. గద్దల ప్రాంగణం విస్తీరణ గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల స్థలం మార్పులు క్యూ లైన్ ల విస్తరణ నూతన మీడియా పాయింట్ భవనం ముఖ్యమంత్రి అతిధి భవనం పూజారుల వసతి భవనం తదితర నిర్మాణాలకు త్వరిత గతిన టెండర్లు పూర్తి చేయాలన్నారు.

భక్తులకు సులువైన దర్శనం కలిగే విధంగా గద్దలను వరుస క్రమంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వందల సంవత్సరాల నిలిచేలా గిరిజన దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.  మేడారం మహా జాతర పనులను  సకాలంలో పూర్తి చేయాలనీ,  అన్ని పనులు నాణ్యతతో శాశ్వతంగా నిలిచే విధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈ ఓ వీరస్వామి, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.