calender_icon.png 30 August, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ పురాతన ఆలయంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

30-08-2025 08:20:14 AM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్లపల్లి లోని పురాతన శివాలయంలో అర్ధరాత్రి  దొంగల బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి  శివాలయం గేటు తాళాలు పగులగొట్టి హుండీ,బీరువా తాళాలను పగల కొట్టి  నగదు తో పాటు దేవాలయంలోని దేవుని సామాన్లను దోచుకుపోయారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుల్తానాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.