30-08-2025 08:22:33 AM
ఇబ్రహీంపట్నం: గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై శుక్రవారం రాత్రి మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు(Maheshwaram Zone SOT Police) దాడి చేశారు. ఈ ఘటన ఆదిబట్ల పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధి సాహేబ్ గూడలోనీ వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో దండు లక్ష్మయ్య, పోతురాజు నర్సింహ, బొమ్మరాజు సురేష్, అల్వాల రాంచంద్రారెడ్డి, గుండ్ల శ్రీనివాస్, పాతూరి శర్వందాగౌడ్, నరేందర్, నారని పరమేష్ గౌడ్ లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.లక్ష 4వేల నగదు తో పాటు, 2 సెట్ల కార్డులు, 8 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.