30-08-2025 01:41:57 AM
బీజేపీ x కాంగ్రెస్
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై వ్యాఖ్యల వివాదం
జెండా కర్రలతో కార్యకర్తల పరస్పరం దాడి
* రాహుల్‌కు కొంచమై నా సిగ్గు మిగిలి ఉంటే మోదీకి ఆయన తల్లికి, ఈ దేశంలోని ప్రజలకి క్షమాపణలు చెప్పాలి. దేవుడు అందరికీ జ్ఞానం ప్రసాదించుగాక. తల్లిని అవమానించడాన్ని ఎవరూ సహించరు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
* అసత్యం, హింసపై సత్యం, అహింస ఎప్పటికైనా విజయం సాధిస్తాయి. మీరు ఎంత కొడతారో కొట్టండి. మేము సత్యం, రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఉంటాం. సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
పాట్నా, ఆగస్టు 29: బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడికి కారణం మీరంటే మీరని ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీహార్‌లో చేపడుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగం గా కొంత మంది ప్రధాని మోదీతో సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శ నం ఇచ్చాయి. దీంతో బీజేపీ నాయకులు పెద్దఎత్తున కాంగ్రెస్‌పై విమర్శల దాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవా రం బీజేపీ కార్యకర్తలు పాట్నాలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ కార్యాల యం ముందు నుంచి వెళ్తుండగా.. గొడవ చోటు చేసుకుంది.
తాము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే కాంగ్రెస్ కార్యాలయం లోపలి నుంచి తమ మీద రాళ్లు వేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తుండగా.. వారే బయటి నుంచి కాంగ్రెస్ కార్యాలయంలోకి రాళ్లు విసిరారని కాం గ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వీరి దాడికి సం బంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు చేతిలో ఉన్న జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కాంగ్రెస్ కార్యాలయం ముందు కొద్ది సేపు యుద్ధ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొట్టారని బీజేపీ నాయకులు ఆరోపి స్తున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త ఈ దాడిపై స్పం దిస్తూ.. తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మోదీతో సహా అతని తల్లిపై అనుచిత వ్యా ఖ్యలు చేశాడంటూ దర్భంగా పోలీసులు మహ్మద్ రిజ్వి అలియాస్ రాజా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ కార్యాలయ గేట్లను తన్నడం వీడియోలో కనిపిస్తోంది.
రాహుల్ క్షమాపణలు చెప్పాలి: అమిత్‌షా
‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొంతమంది కాం గ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై శుక్రవారం హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. గువాహటిలో అమిత్‌షా మాట్లాడారు. ‘రాహుల్ గాంధీకి కొంచమైనా సిగ్గు మిగిలి ఉంటే మోదీకి ఆయన తల్లికి, ఈ దేశంలోని ప్రజలకి క్షమాపణలు చెప్పాలని నేను అభ్యర్థిస్తున్నాను. దేవుడు అందరికీ జ్ఞా నం ప్రసాదించుగాక.
రెండు రోజుల కిందట ఏం జరిగిందో దేశం మొత్తం చూసింది. మోదీ తల్లి పేదరికంతో జీవించినా విలువలతో బిడ్డలను పెం చింది. కొడుకును నమ్మకమైన నాయకుడిగా ఎదిగేందుకు వీలు కల్పించింది. అలాంటి తల్లిని అవ మానించడాన్ని భారతీయులెవరూ సహించరు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు డుత నం ఇంకోటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తు న్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ నా యకులు ప్రతి ఒక్కరూ ఖండించదగ్గ చర్యకు పా ల్పడ్డారు.
వారు ఘస్‌పైతియ బచావో యా త్ర (చొరబాటుదారుల రక్షణ యాత్ర)లో మోదీ తో సహా ఆయన తల్లిని ఘోరంగా అవమానించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది. కాంగ్రెస్ ఎంత లా అవమానిస్తే బీజేపీ అంతలా విజయాలు సా ధిస్తుంది. రాహుల్ గాంధీ ఘస్‌పైతి య బచావో యాత్ర (చొరబాటుదారుల రక్షణ యాత్ర) చేస్తూ బీహార్‌లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని అమిత్‌షా ఆరోపణలు గుప్పించారు.
సత్యానిదే విజయం: రాహుల్ గాంధీ
అహింస, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘అసత్యం, హింసపై సత్యం, అహింస ఎప్పటికైనా విజయం సాధిస్తాయి. మీరు ఎంత కొడతారో కొట్టండి. మేము సత్యం, రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఉంటాం. సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నారు. ప్రధాని ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది బీజేపీ ఏజెంట్‌లే అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
యాత్ర నుంచి అందరి దృష్టిని మరలించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ‘ఆ వ్యాఖ్యలు చేసింది వారి ఏజెంటే. యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోంది. వారి దొంగ దొరికే సరికి వీరు అసహనానికి గురవుతున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరో, ఆయన ఎవరి ప్రతినిధో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. బీజేపీ గుండాయిజాన్ని దేశం మొత్తం చూస్తోంది’ అని విమర్శించారు.
రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలి: బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి
హైదరాబాద్ ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధికార ప్రతినిధి సుభాష్ డిమాండ్ చేశారు. ఇకపై కాంగ్రెస్ చేసే ప్రతి అనుచిత వ్యాఖ్య ప్రజల్లో మోదీకి మరింత ఆదరణ పెంచడానికే దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.