30-08-2025 02:23:02 AM
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాని కి చాలా నిధులు అవసరమని, కానీ జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వ హించిన “జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై వివి ధ రాష్ట్రాల సంప్రదింపుల సమావేశం”లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రేట్ల హేతుబద్ధీకరణకు మద్దతు ఇవ్వడానికి మనమందరం సిద్ధంగా ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం చూపే నష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టవశాత్తు రేటు హేతుబ ద్ధీకరణ ప్రకటన ఏకపక్షంగా జరిగిందన్నారు. రాష్ట్రాలను బాగు చేయడానికి నిధులు అవసరమని, రాష్ట్రాభివృద్ధిలో పన్ను విధించడం ఎంతో సహాయపడుతుందని తెలిపారు.
తెలంగాణపై జీఎస్టీ ఎఫెక్ట్
తెలంగాణ జీఎస్టీ ఆదాయం 2024 వరకు 10 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించిందని గుర్తించామని, ఇది వ్యాట్‌లో 18 శాతం వార్షిక వృద్ధి రేటుగా ఉందని భట్టి తెలిపారు. ఆర్థిక చర్యల స్వేచ్ఛతో వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024--25 సంవత్సరానికి ఆదాయం రూ.69,373 కోట్లు ఉండే దని, జీఎస్టీ ద్వారా ఆదాయం రూ.42,443 కోట్లకు తగ్గిందని వెల్లడించారు.
ప్రతిపాదిత రేటు హేతుబద్ధీకరణ కారణంగా తెలంగాణ కనీసం రూ.5,100 కోట్లు నష్టపోతుందని, విభజనతో పాటు, నష్టం దాదాపు రూ .7,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇది జీఎస్టీ ఆదాయంలో దాదాపు 15 శాతం కాగా మొత్తం రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆదాయంలో 80 శాతం కంటే ఎక్కువ సంక్షేమ వ్యయం కోసం ఉద్దేశించినట్టు చెప్పారు.
తెలంగాణ జీఎస్టీ, జీఎస్డీపీ నిష్పత్తి 2022--23లో 3.07 శాతం నుంచి 2024--25లో 2.58 శాతానికి క్రమంగా తగ్గుతోందని, రేటు హేతుబద్ధీకరణ దీనిని మరింత తగ్గిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను విధించడంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేనప్పుడు అదనపు ఆదాయానికి తగిన విధా నాన్ని ప్రవేశపెట్టకపోతే ఆర్థిక భారం భారీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పన్ను తగ్గింపు పేద, మధ్యతరగతి వర్గాలకు చేరేలా ఉంటే రేటు హేతుబద్ధీకరణకు రాష్ట్రాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో కర్ణాటక రెవెన్యూ మంత్రి- కృష్ణ బైరేగౌడ, పంజాబ్, కేరళ, జార్ఖండ్,తమిళనాడు ఆర్థిక మంత్రులు- హర్పాల్ సింగ్ చీమా,- కే.ఎన్.బాలగోపాల్, రాధాకృష్ణ కిషోర్, తంగం తెన్నరసు, హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేశ్ ధర్మాని, పశ్చిమ బెంగాల్ రెసిడెంట్ కమిషనర్ ఉజ్జయిని దత్తా పాల్గొన్నారు.
3న బ్రేక్‌ఫాస్ట్ సమావేశం
సమావేశం అనంతరం భట్టి విక్రమార్క విలేఖరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 3వ తేదీన తమిళనాడు భవన్‌లో ఇదే అంశంపై బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అక్కడ కూడా కీలక అంశాలపై చర్చించి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. త్వరలోనే జరగ బోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను లేవనెత్తుతామని, చా లా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.
అందుకే కేంద్రం జీఎస్టీ హేతుబద్ధీకరణ అం శంపై ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణలో సంభవించిన వరదలకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే చేశారు. త్వరలోనే ఆ నివేదికను కేంద్రానికి సమర్పించి సాయం కోరతామని స్పష్టం చేశారు.