calender_icon.png 5 August, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోణీ కొట్టిన పాకిస్థాన్

04-10-2024 12:01:46 AM

  1. శ్రీలంకపై విజయం 
  2. మహిళల టీ20 ప్రపంచకప్

షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. గురువారం గ్రూప్ భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 31 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫాతిమా సనా (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిదా డర్ (23) పర్వాలేదనిపించింది.

లంక బౌలర్లలో ఆటపట్టు, ప్రబోధని, సుగంధిక తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 117 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 89 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. నిలక్షిక సిల్వ (22),  ఓపెనర్ విశ్మీ గుణరత్నే (20) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు.

సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ చమేరి ఆటపట్టు కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం జట్టును దెబ్బతీసింది. పాకిస్థాన్ బౌలర్లలో సదియా ఇక్బాల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫాతిమా, సోహెల్ 2 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన ఫాతిమా సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.