calender_icon.png 17 May, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీని వణికిస్తున్న పాక్ బిచ్చగాళ్లు

17-05-2025 01:21:00 AM

5,033 మందిని స్వదేశానికి పంపిన సౌదీ

న్యూఢిల్లీ, మే 16: యాచకులను ఎగుమతి చేసే దేశంగా పాక్ అయాచిత అపకీర్తిని పొందింది. తాజాగా సౌదీ అరేబీయాలో పాకిస్థాన్‌కు చెంది న 5,033 మంది బిచ్చగాళ్లను స్వదేశానికి బలవంతంగా పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీ (ఆ దేశ పార్లమెంట్)లో వెల్లడించినట్టు డాన్ పత్రిక కథనంలో పేర్కొనడం గమనార్హం.

‘మేం ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్టు చూస్తారు’ అంటూ మూడేళ్ల క్రితం పాక్ పీఎం హెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దయాది దేశ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇక 2024, జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను కలుపుకొంటే ఇది 5,402కు చేరుతున్నట్టు తెలుస్తోంది.

వీరిని సాగనంపిన వారిలో సౌదీతోపాటు ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి. ఈ మొత్తం లో సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారే 2,795 మంది ఉండటం విశేషం. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437 మంది, కేపీ నుంచి 1,002, బలోచిస్థాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు.