24-04-2025 12:40:23 AM
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.
నారాయణపేట. ఏప్రిల్ 23(విజయక్రాంతి): భూ భారతి ద్వారా సాదా బైనామా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి తెలిపారు. ఈ కొత్త పోర్టల్ తో రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడతాయని వారు పే ర్కొన్నారు.
భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం నారాయణ పేట నియోజకవర్గంలోని ధన్వాడ, దామర గిద్ద , తహాసిల్దార్ల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు కలెక్టర్, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానం లో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం ధరణిని రద్దుచేసి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టం ద్వా రా రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారికి భూధార్ కార్డును ఇవ్వడం జ రుగుతుందన్నారు.
ధరణిలో అధికారులకు అధికారాలను తొలగించడం వల్ల భూ సమస్యల పరిష్కారం నిమిత్తం రైతు లు, సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, భూ భారతిలో అలాంటి అవసరం లేదని తెలిపారు. కింది స్థాయి అధికారుల వద్ద పొరపాట్లు జరిగితే లేదా పని కాకపోయినా పై స్థాయి అధికారు లు న్యాయం చేసే అవకాశం భూ భారతిలో ఉందన్నారు. ధరణిలో సాదా బైనామా ల పరిష్కారానికి ప్రొవిజన్ లేకపో యిందని, కొత్త పోర్టల్ లో వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె తెలిపారు.
అధికారులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే రైతులు సైతం భూ భారతి చట్టం అమలులో అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జూన్ 2 తర్వాత జిల్లాలోని అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రా మాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి స మస్యల దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ.. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూ భారతి చట్టంలో ఉ న్నాయన్నారు. భూ భారతిలో తహసిల్దార్ వద్దనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇవి కూడా ఉచితంగానే పరిష్కారం అవుతాయని, ఎవరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కింది స్థాయి నిర్ణయాన్ని పై స్థా యిలో అప్పీల్ చేసే అవకాశం భూ భారతిలో ఉందన్నారు.
ప్రస్తుతం అందరికి ఆధార్ కార్డులు ఉన్నట్టే ఇకపై ప్రతీ రైతుకు తన భూమికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన భూ దార్ కార్డును కూడా అధికారులు ఇస్తారని ఆమె తెలిపారు. జూన్ 2 తర్వాత అధికారులే మీ మీ గ్రామాలకు వచ్చి ఇలాం టి సదస్సులు పెట్టీ సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారని ఆమె చెప్పారు. కొత్త చట్టం గురించి రైతులందరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆమె కోరారు.
కాగా ఇటీవలే వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో దామరగిద్దకు చెందిన చెన్నారం అక్షయ 470 మార్కులకు గాను 469 మా ర్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు ను సాధించడం పట్ల కలెక్టర్, ఎమ్మెల్యే ఆ విద్యార్థిని దామర గిద్ద సదస్సులో శాలువాతో సన్మానించి అభినందించారు.
ఆయా సదస్సులలో ధన్వాడ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, దామరగిద్ద సింగ ల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, ధన్వాడ, దామరగిద్ద తహాసిల్దార్లూ సింధుజ, జమీల్, ఎంపీడీవోలు సుదర్శన్, జయ లక్ష్మీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.