calender_icon.png 19 December, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మాగి గ్రామ సర్పంచ్ని సన్మానించిన నాగిరెడ్డిపేట్ మండల పంచాయతీ కార్యదర్శులు

19-12-2025 09:45:41 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నిజంసాగర్ మండలంలోని మాగి గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ను నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్,గోలిలింగాల,నాగిరెడ్డిపేట గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మల్లికార్జున్, సంతోష్ కుమార్,కార్తీక్లు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ... ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో నిజంసాగర్ మండలం మాగి గ్రామ పంచాయతీ సర్పంచిగా నూతనంగా ఎన్నికైన సుమిత్ర శ్రీనివాసులు నాగిరెడ్డిపేట మండలం ఎంపీగా గత కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు.

ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తుచేసుకొని సన్మానించామన్నారు.అనంతరం ఆయన మాగి గ్రామంలో స్థిరపడి ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్స్ సిబ్బంది చిరంజీవులు ఉన్నారు.