పాపన్న జీవితం అందరికీ ఆదర్శం
13-08-2026 12:25 AM
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, ఆగస్టు12 (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న వెనుకబడిన కులా ల వారిలో ఆత్మ స్థైర్యం నింపి అందరికీ అదర్శప్రాయునిగా నిలిచారని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పేరిట రూపొందిన చలనచిత్రంలోని పాటను సికింద్రాబాద్ లోని తన నివాసంలో తీగుళ్ళ పద్మారావు గౌడ్ బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక చై తన్యం నింపి,తన పోరాటపటిమతో సర్వా యి పాపన్న అందరినీ సంఘటితం చేసిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. సర్దార్ పా పన్న జీవితాన్ని భావితరాలకు చాటడం ద్వా రా వారిలో మంచి స్పూర్తిని కలిగించాల్సి ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.






