03-08-2025 01:12:58 AM
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం తల్లిదండ్రుల బృందం కాలేజ్ ప్రిన్సిపల్ నీ కలసి రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే తాత్కాలిక మరియు స్థిర అధ్యాపకులను నియమించాలని. అదనపు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ... సబ్జెక్ట్ టీచర్లు లేనంత కాలం పిల్లలకు విద్యలో లోటు ఏర్పడతుందని. దీని ప్రభావం వారితో పాటు కుటుంబాల మీద కూడా పడుతుందన్నారు. విద్యా శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.