26-07-2025 11:11:37 PM
రాజాపూర్: బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP state president Ramchander Rao), ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) కలసి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం రాజాపూర్ మండల కేంద్రంలో మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్గిల్ విజయ దివాస్ పురస్కరించుకుని మాజీ భారత జవాన్లను శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి నిరంతరం దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలు వెలకట్టలేనివాని అన్నారు. అలాగే బీజేపీ బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాను ఎగురవేయాలని తెలిపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్, నర్సింహులు, ఆదిత్య, శేఖర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.