calender_icon.png 26 January, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు, యువతలో దేశభక్తిని పెంపొందించాలి

26-01-2026 12:09:57 AM

గట్టు జనవరి 25 విద్యార్థులు,యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశభక్తి చాటే గేయాన్ని రచించిన రచయిత డేవిడ్ ను గ్రామస్తులు ప్రశంసించారు.గట్టు మండ లం మాచర్ల గ్రామానికి చెందిన డేవిడ్ రచించిన జయహో భారత్ ఆడియో సాంగ్ ను సర్పంచ్ వజ్రమ్మ తిమ్మప్ప, ప్రధానోపాధ్యాయులు రాంబాబు,రఘు చేతుల మీదుగా విడుదలను చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ఇలాంటి పాటలు మరిన్ని రచించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.