23-09-2025 06:23:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 26న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్లో అత్యుత్తమ మార్పు సాధించి మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యదర్శులతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఆయా కళాశాలలో ప్రిన్సిపల్ సమక్షంలో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలు కళాశాల అభివృద్ధిపై చర్చించడం జరుగుతుందన్నారు ఈ సమావేశాలకు పోషకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు