calender_icon.png 23 September, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్పాహారం పంపిణీ

23-09-2025 07:49:19 PM

మందమర్రి (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంకు వచ్చిన ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రజలకు అల్పాహారం పంపిణీ చేసినట్లు తహసిల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సుదూర ప్రాంతాల నుండి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి ఆకలితో బాధపడకూడదనే ఆశయంతో ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశానని ఆయన స్పష్టం చేశారు.

గత వేసవి నుండి నేటి వరకు ప్రతి నిత్యం. కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఆల్ఫాహారం, అంబలి, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చే ప్రజలకు అల్పాహారం పంపిణీ చేయడం పట్ల పలువురు రాజకీయ నాయకులు మండల ప్రజలు తహసిల్దార్ ను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాథోడ్ గణపతి, కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్, పెంచాల రాజలింగు, కొట్టే సంపత్, ఎగుడ రాయమల్లు, రాచకొండ కమల మనోహర్ రావు, కార్యాలయం అధికారు లు సిబ్బంది పాల్గొన్నారు.