23-09-2025 06:19:20 PM
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
నల్గొండ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ టౌన్(విజయక్రాంతి): 2027 లోపు నూతన టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ ఎమ్మెన్నార్ గార్డెన్ లో నిర్వహించిన నల్లగొండ నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు కార్యకర్తలు చాలెంజ్‌గా తీసుకొని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపు నిచ్చారు.
నల్లగొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా నిజమైన కార్యకర్తలే పార్టీ బలం అని వ్యాఖ్య నిచ్చారు. 30 ఏళ్లుగా తనను అక్కున చేర్చుకున్న కార్యకర్తలకు సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదే అని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో మరింత మెరుగైన సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని అన్నారు.