calender_icon.png 15 September, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీఏఆర్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలలో సత్తా చాటిన పావని

15-09-2025 12:00:00 AM

గరిడేపల్లి, సెప్టెంబర్ 14 : మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన వెలుగూరి పావని జాతీయస్థాయిలో ప్రతిభను చాటింది. ఆదివారం ప్రకటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 88, బీసీ కేటగిరీలో 52వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం పావని అరుణాచల్ ప్రదేశ్లో అగ్రికల్చర్ చదువుతోంది. పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు వెంకట నర్సింహారావు, కవితతో. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.