15-09-2025 12:00:00 AM
జిల్లాలో ఐదు మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు
నిర్మల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): జిల్లాలో ఆగస్టు కురిసిన భారీ వర్షాలు భూగ ర్భ జలాలను నింపాయి. జిల్లా వ్యాప్తంగా మే నెలతో పోలిస్తే సగటున 5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్టు జిల్లా శాఖ అధికారులు తెలిపారు. మే నెలలో జిల్లాలో సగటున 9. 4 మీటర్ల లోతులో ఉన్న భూగోధిలాలు జూన్ జూలై ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు 4.5 మీటర్లకు చేరుకున్నట్టు భూగర్భ జిల్లా శాఖ నిర్వహించిన లెక్కల్లో మైంది.
నిర్మల్ జిల్లాలో 18 మండలాలు మూడు మున్సిపాలిటీలు 400 గ్రామ పంచాయతీలు ఉండగా జిల్లా భూగర్భ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజిటల్ వాటర్ లెవెల్ మిషన్ పరి కరాల ద్వారా భూగర్భ జలాల లెక్కింపు ప్రతినెల నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని 42 ప్రాంతాల్లో డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రతి నెల 25న భూగర్భ జలాలను టెక్నికల్ సిబ్బంది సాంకేతిక సాయంతో కురుస్తున్నారు. మే నెలలో సగటున 9.5 మీటర్ల లోతులో ఉన్న జూన్ జూలై వర్షాలకు కేవలం ఒక్క మీట ర్ మాత్రమే పెరగగా ఆగస్టు వర్షాలతో మరో మూడు మీటర్లు పెరిగినట్టు జిల్లా భూగర్భ జిల్లా శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో సమృద్ధిగా జలాలు
నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మూ డు నెలల్లో కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో చెరువులు ప్రాజెక్టులు నిండుకోవడం గోదావరి స్వర్ణ గడ్డిన్న శుద్ధ వాగు కడెం నారాయ ణరెడ్డి ప్రాజెక్టుల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టులన్ని నిండుగా భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో నిర్మల్ బోసి లక్ష్మణ చందా లోకేశ్వరం అబ్దుల్లాపూర్ పెద్ద ప్రాం తాల్లో భూగర్భ జిల్లాలు రికార్డు స్థాయిలో మూడు మీటర్లకు చేరుకోవడంతో జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధి జననీయంగా ఉం ది.
దీంతో వానకాలంతోపాటు ఎండాకాలం లో భూగర్భ జలాలు జిల్లా ప్రజల అవసరం మేరకు పెరిగాయని వాటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని, భూగర్భ జల శాఖ ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తుందని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో వ్యవసాయ పంపు సెట్లకు బోరుబావులకు నీటి కొరత ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఉన్న భూగర్భ జలాలను వృధా చేయకుండా పొదుపు పాటిస్తూ వృధా జలాలను ఇంకేటట్టు ఇంకుడు గుంత లు కందకాలు చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.