calender_icon.png 4 December, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించండి

04-12-2025 06:05:35 PM

హనుమకొండ (విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యములో గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని కలసి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి బకాయిలు చెల్లించుటకు ఒత్తిడి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్మెంట్ బకాయిలు 20 నెలలు గడిచినా చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు మానసికంగా కృంగిపోయి, తీవ్ర అనారోగ్యానికి గురియై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయినారని, ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 15000 మంది ఉద్యోగులు రిటైర్ అయినా కేవలం 1000 మందికి మాత్రమే హైకోర్టు ఆదేశాల మేరకు, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా రావడం జరిగింది. మిగతా 14000 మంది రిటైర్మెంట్ బకాయిలు రాక పెన్షనర్లు మానసికంగా కృంగిపోతూ, అనారోగ్యంతో బాధపడుతూ కొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ లక్షలకొలది డబ్బు ఆసుపత్రులలో చెల్లించలేక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి 14000 కుటుంబాలను ఆదుకోవాలని,వారికి రావలసిన బకాయిలను మానవతా దృష్టితో ఆలోచించి తక్షణం పిఆర్సి 2020 ఏరియర్స్, జిపిఎఫ్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవులు, లీవు ఇన్కేష్మెంట్ లీవులు మొదలగునవి వెంటనే చెల్లించాలని కోరారు.

దానికి దొంతి మాధవరెడ్డి స్పందించి తప్పనిసరిగా బకాయిల చెల్లింపులో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ,త్వరగా చెల్లించడానికి ముఖ్యమంత్రి పై, ఫైనాన్స్ మంత్రి పై ఒత్తిడి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ల ధర్మేంద్ర , ప్రధాన కార్యదర్శి  కడారి భోగేశ్వర్ , జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు, ఎం.డి. మహబూబ్ అలీ, జాయింట్ సెక్రెటరీ ఎం.డి. అబ్దుల్ గఫార్, స్థానిక రిటైర్డ్ ఉద్యోగులు కె.యాకయ్య, బి.వి. ప్రసాద్, ఎం.మురళి, పి. కుమార్ రెడ్డి, సి.హెచ్. రామచంద్రయ్య,ఎస్. సాంబయ్య, ఎన్. వెంకట్రాం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.