calender_icon.png 4 December, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి

04-12-2025 05:45:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, అంబాజీ, మోహన్ సింగ్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజరు నరసింహ రెడ్డి, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం రామ్ గోపాల్, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.