04-12-2025 05:57:40 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో పని చేసి పదవీవిరమణ పొంది పెన్షన్ పొందే, సిపిఆర్‌ఎంఎస్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డ్ పొందిన ఉద్యోగులు, 2026 సంవత్సరానికి గాను సిఎంపిఎఫ్ పెన్షన్ పొందుటకు సిపిఆర్‌ఎంఎస్ హెల్త్ కార్డ్ రెన్యువల్ కొరకు, ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలి. కానీ ఇప్పటివరకు చాలా మంది మాజీ ఉద్యోగులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించలేదు.
ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని సింగరేణి మాజీ ఉద్యోగులు, తమ మొబైల్ ఫోన్ లోని జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ ఆధార్ ఫేస్ ఆర్ డి ఆండ్రాయిడ్ అప్లికేషన్ల ద్వారా, లేదా స్వయంగా సిఎంపిఎఫ్/సిపిఆర్‌ఎంఎస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని, లేదా దగ్గరలోని మీసేవా కేంద్రం వద్ధనైనా సమర్పించి, నిరాటంకమైన పెన్షన్, వైద్య సేవలు పొందవలసినదిగా జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్ పత్రికా ప్రకటనలో భాగముగా తెలియజేశారు.