calender_icon.png 4 December, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి

04-12-2025 06:00:44 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వర్థంతిని గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... కొణిజేటి రోశయ్య స్వాతంత్ర యోదుడిగా పేరు తెచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖలకు మంత్రిగా పని చేసి.. ముఖ్యమంత్రిగా, గవర్నగా పని చేసి.. ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.