04-12-2025 06:02:56 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ మహాజన్ జితేందర్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సంఘం స్థానిక మానసిక వికలాంగుల భవిత కేంద్రంలో వికలాంగులకు నోట్ బుక్స్, పెన్నులు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిటికేసి రవీందర్, ప్రధాన కార్యదర్శి చిటికేసి సతీష్, కుమార్ కోశాధికారి కూరగాయల సతీష్ కుమార్, మండల విద్యాధికారి సంధ్య, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇంచార్జ్ సాయన్న, భవిత కేంద్ర ఇంచార్జ్ లక్ష్మి ,శంకర్ ,రవికాంత్, ప్రవీణ్, సరిత ,గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు.