calender_icon.png 4 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..

04-12-2025 06:07:31 PM

రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నెల్లి రాజు..

కొల్చారం (విజయక్రాంతి): తనను గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నెల్లి రాజు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాజు స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు.